ఆంధ్రప్రదేశ్

షాక్: జియో కి దీటుగా బంపర్ ఆఫర్ ఇచ్చిన ఎయిర్ టెల్



జియో విసురుతున్నసవాళ్లను ధీటుగా ఎదుర్కోవటానికి వీలుగా తాజాగా ఎయిర్ టెల్ భారీ ఆఫర్ ను ప్రకటించింది. తాను ప్రకటించిన తాజా ఆఫర్ తో చెలరేగిపోవాలని భావిస్తోంది. ఏడాది పాటు 4జీ డేటాను అందించటంతో పాటు.. తాజా ఆఫర్ జనవరి 4 నుంచి షురూ అయి.. ఫిబ్రవరి 28 వరకూ అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. ఈ ఆఫర్ లో ఒకసారి ఎంటర్ అయితే.. ఏడాది పాటు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చని ఊరిస్తోంది.

తాజా ఆఫర్ లో భాగంగా.. ప్రతి వినియోగదారుడు ప్రతి నెలా 3జీబీ ఉచిత డేటాను పొందే వీలుందని.. ఎంపిక చేసిన ప్రీపెయిడ్.. పోస్ట్ పెయిడ్ వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని పేర్కొంది. దేశ వ్యాప్తంగా 4జీ హ్యాండ్ సెట్ల వినియోగం పెరుగుతుందని.. వేగవంతమైన బ్రాండ్ సేవల్ని అందించేందుకు తామీ ఆకర్షణీయమైన పథకాన్ని అనౌన్స్ చేసినట్లు వెల్లడించింది.

తాజా ఆఫర్ ప్రకారం.. 4జీ హ్యాండ్ సెట్లు కలిగిన ప్రీపెయిడ్ వినియోగదారులు రూ.345తో రీఛార్జ్ చేసుకుంటే తాజా పథకంలోకి వస్తారు. దీని కింద ఏ నెట్ వర్క్ కు అయినా ఉచిత లోకల్.. ఎస్టీడీ కాల్స్ వినియోగించుకోవటంతో పాటు.. 4జీబీ డేటాను ప్రతి నెలా పొందే వీలుంది. 28 రోజుల పాటు సాగే ఈ ఆఫర్ ను డిసెంబరు 31వ తేదీ లోపు 13 సార్లు మాత్రమే రీఛార్జ్ చేసుకునే వీలుంది. ఇక.. పోస్ట్ పెయిడ్ వినియోగదారులు రూ.549 ప్లాన్ కింద అపరిమిత కాల్స్ తో పాటు 6 జీబీ డేటాను పొందే వీలుంది. ఇక.. రూ.799 ప్లాన్ కింద అపరిమిత కాల్స్ తో పాటు 8 జీబీ డేటాను ఉచితంగా పొందే వీలుంది. ఎయిర్ టెల్ ప్రకటించిన ఈ ఆఫర్ తో టెలికం కంపెనీల మధ్య యుద్ధం మరింత ముదరటం ఖాయమని చెప్పొచ్చు.


Comments

Facebook




నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu