గాసిప్స్

షాక్‌: అల్ల‌రి న‌రేష్ గుడ్ బై


allari_naresh_solo_stills_2211110218_020

అల్ల‌రి న‌రేష్ వ‌రుస ప్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నాడు. ప్ర‌స్తుతం న‌రేష్ కేరీర్‌కు ఒక హిట్ సినిమా అత్య‌వ‌స‌రం. ఇప్ప‌టికే న‌రేష్ వ‌రుస‌గా 8 ప్లాపులు ఎదుర్కొన్నాడు. న‌రేష్ మార్కెట్ ఫుల్‌గా డ‌ల్ అయ్యింది. న‌రేష్ సినిమాల‌కు అడ్వాన్స్‌లు కూడా ఇచ్చే ప‌రిస్థితి లేదు. ఈ క్ర‌మంలో న‌రేష్ తాజా చిత్రం ఎప్పుడో దసరా పండక్కే రావాల్సిన సినిమా ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’. కానీ అప్పుడు పోటీ ఎక్కువుందని దీపావళికి వాయిదా వేశారు.

దీపావ‌ళికి అనుకున్నా అప్పుడు కూడా ఆ సినిమా రాలేదు. ఆ త‌ర్వాత న‌వంబ‌ర్ 11 అనుకుంటే పెద్ద నోట్ల ర‌ద్దుతో వెన‌క్కి త‌గ్గారు. ఆ త‌ర్వాత వారం రిలీజ్ చేద్దామ‌ని నిర్మాత బీవీఎస్ఎన్‌.ప్ర‌సాద్ అనుకున్నా … థియేటర్లు బాగానే దొరికేట్లున్నా.. విడుదలకు సాహసించలేదు ప్రసాద్.

ఇక డిసెంబ‌ర్ 9న ధృవ‌, 16న ఎస్‌-3 సినిమాలు ఉన్నాయి. అస‌లే క‌ష్టాల్లో ఉన్న అల్ల‌రోడికి డిసెంబ‌ర్ కూడా పెద్ద‌గా క‌లిసి వ‌చ్చేలా లేదు. ఈ లెక్క‌న చూసుకుంటే ఈ సినిమాను ఈ యేడాది చివ‌ర్లో డిసెంబ‌ర్ 30న రిలీజ్ చేయాల‌ని భావిస్తున్నార‌ట నిర్మాత‌.

అయితే అప్పుడు కూడా న‌రేష్ గ‌ట్టి పోటీ ఉంది. డిసెంబరు 23న రామ్ గోపాల్ వర్మ ‘వంగవీటి’.. నాని మూవీ ‘నేను లోకల్’ విడుదలయ్యే అవకాశముండటంతో డిసెంబరు 30న సినిమాను రిలీజ్ చేసి ఈ ఏడాదికి గుడ్ బై చెప్పాలని డిసైడయ్యారట. ఓవ‌రాల్‌గా అల్ల‌రోడు త‌న సినిమాతో ఈ యేడాదికి గుడ్ బై చెప్ప‌నున్నాడ‌న్న‌మాట‌.


Comments

Facebook




నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu