అంతర్జాతీయ

2017లో బయల్దేరిన విమానం 2016లో చేరింది


boing

అదేంటి తప్పుగా రాశారు? 2017లో బయల్దేరితే..2016లో చేరుతారా?! అది కూడా విమానప్రయాణంలో!! అనేదే కదా మీ సందేహం. నిజంగానే ఇలా కొందరు ప్రయాణికులు 2017లో బయల్దేరి 2016లో గమ్యస్థానానికి చేరుకున్నారు. యునైటెడ్ ఎయిర్ లైన్స్ ప్రయాణికులు కొత్త సంవత్సరం సందర్భంగా ఈ థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ పొందారు. వివిధ దేశాల మధ్య ఉన్న సమయం మధ్య తేడాల వల్ల ఈ ప్రత్యేక అనుభూతి సాధ్యమైంది. ఈ ప్రయాణంలో భాగంగా ఉన్నవారు తమ క్రేజీ జర్నీకి సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేయడంతో అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి

ఈ ఆసక్తికరమైన టూర్ వివరాలు ఇవి…యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానం యూఏ890 (బోయింగ్ 787-909) విమానం 2017 జనవరి 1వ తేదీన వేకువజామున చైనాలోని షాంఘైలో బయలుదేరింది. ఆ బోయింగ్ విమానం 2016 డిసెంబర్ 31న రాత్రి అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు చేరుకుంది! అంటే సాంకేతికంగా చూస్తే ఒక ఏడాది వెనుక సమయంలో గమ్యస్థానానికి చేరుకుందన్నమాట. ఇలా ఎలా సాధ్యమైంది అనే ఆసక్తికరమైన సందేహానికి ఈ రెండు దేశాల మధ్య ఉన్న టైం తేడాలే సమాధానం. శాంఘై- శాన్ ఫ్రాన్సిస్కోల మధ్య టైమ్ వ్యత్యాసం దాదాపు 16 గంటలు. ఇక విమాన ప్రయాణం పరంగా చూస్తే..శాంఘై నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లడానికి దాదాపు 11 గంటల 5 నిమిషాలు పడుతుంది.సో..జనవరి ఒకటి 2017న శాంఘై నుంచి బయలుదేరిన ప్రయాణికులు శాన్ ఫ్రాన్సిస్కోకు 2016 డిసెంబర్ 31న రాత్రి చేరుకున్నారన్నమాట.

ఎవరైనా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్  విధంగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఈ ప్రయాణికులు మాత్రం మరిచిపోలేని అనుభూతిని పొందారు. అందుకే వారి ఫోటోలు అంతలా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి అంతేకదా మరి కొత్త ఏడాది బయలుదేరి పాత ఏడాదిలో అడుగుపెట్టడం ఎవరికైనా క్రేజీనే కదా. ఏమంటారు.


Comments

Facebook




నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu