నేటి వార్తలు

కమెడియన్ పొట్టి రమేష్ భార్య సూసైడ్ ఇన్వెస్టిగేషన్ లో బయటపడ్డ పచ్చినిజాలుకమెడియన్ పొట్టి భార్య త్రిపురాంభిక తన ఇంట్లోనే సూసైడ్ చేసుకుని చనిపోయిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా త్రిపురాంభిక తల్లి పుష్ప ఎన్నో పచ్చినిజాల్ని బయటపెట్టారు. పెళ్ళయినప్పటి నుంచి రమేష్ కుటుంబసభ్యులు తన బిడ్డను నిత్యం చిత్రహింసలకు గురిచేసేవారని, సూటిపోటి మాటలతో పెళ్ళయిన ఏడాదిలోనే వందేళ్ల నరకాన్ని చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు పిల్లనిస్తే చాలని, గుండెల్లో పెట్టుకుంటామని చెప్పి, కట్నం కోసం మానసికంగా వేధించి చివరికి తన బిడ్డ ప్రాణాలను వాళ్లు తీసుకున్నారని పుష్ప రోధించారు. ఇంకా ఆమె ఏమన్నారంటే..

‘రమేష్‌ కుటుంబంతో మాకు దూరపు బంధుత్వం ఉంది. ఆ రిలేషన్ వల్లే నా బిడ్డ (త్రిపురాంభిక)నిచ్చి పెళ్ళి చేశా. పెళ్ళి సమయంలో మా ఆర్థిక పరిస్థితి అంతగా ఏం బాగోలేదు. కట్నకానుకలు ఇచ్చుకోలేమని వారికి చెప్పాం. అందుకు వారు ఒప్పుకున్నారు. తమ కూతురు సంతోషంగా ఉండాలని.. స్థోమతకు మించి అప్పులు చేసి పెళ్లి చేశాం. పెళ్లయిన మూడు నెలల వరకు నా బిడ్డని అత్తింటివారు బాగానే చూసుకున్నారు. కానీ.. ఆ తర్వాత కట్నం కోసం హింసించడం ప్రారంభించారు. సూటిపోటి మాటలతో జీవితంపై విరక్తి కలిగించేలా ప్రవర్తించేవారు. ముఖ్యంగా.. నా బిడ్డ అత్త(అమ్మమ్మ అవుతుంది), ఆడపడుచు(పిన్ని) ఘోరంగా హింసించేవారు’.

‘కాసేపు సోఫాలో కూర్చున్నా తప్పే. ‘నీ ముఖానికి సోఫా కావాలా.. ఏదో ఒక మూలన కూర్చో’ అంటూ ఎగతాళి చేసేవారు. భోజనం తినేటప్పుడు కూడా నానా మాటలతో టార్చర్‌ పెట్టారు. ఇంట్లో పని మనషి ఎందుకు? నువ్వున్నావుగా? అంటూ నా బిడ్డతోనే అన్నీ చేయించారు. అంతేకాదు.. నాకు ఫోన్‌ చేసుకోవాలన్నా కూడా ఆంక్షలే ఉండేవి. రాత్రిపూట అందరూ పడుకున్న తర్వాత.. దొంగచాటుగా ఫోన్‌ చేసి నాతో మాట్లాడాల్సిన పరిస్థితిని కల్పించారు. కొద్దిరోజుల నుంచి పిల్లలు పుట్టడం లేదని కూడా హింసించడం ప్రారంభించారు. ఇంకా పిల్లలు పుట్టకపోతే నువ్వెందుకే అంటూ హింసించేవారు. ఇలా ప్రతిరోజూ రాత్రి వరకు అవకాశం దొరికినప్పుడల్లా మాటలతో క్షోభపెట్టడమే పనిగా పెట్టుకున్నారు’.

‘అమ్మాయి పడుతున్న ఇబ్బందులు తెలిసి రెండు సార్లు వెళ్లాం. ‘అమ్మాయిని బాగానే చూసుకుంటున్నాం.. మీకేమీ భయం లేదని’చెప్పేవారు. మేం వెళ్లిపోగానే ‘వాళ్లకు ఫోన్‌ చేసి విషయమంతా చెబుతావా’ అంటూ చిత్రహింసలకు గురిచేసేవారు. ఆ బాధలు భరించలేక నాతో చెప్పుకున్నా.. భరించమన్నామే తప్ప.. తన కష్టాలను అర్థం చేసుకోలేకపోయా. ఇంతా జరుగుతున్నా మేం ఏనాడూ రమేష్‌కు చెప్పలేదు. నా బిడ్డ ఒకటి, రెండుసార్లు చెబితే ‘నేనేమైనా అంటే నువ్వు బాధపడాలి.. వాళ్ల మాటలు పట్టించుకోకు’ అని చెప్పేవాడు. దాంతో.. వాళ్లు పెట్టే బాధల గురించి రమేష్‌కి చెప్పడం త్రిపురాంభిక మానేసింది’.

‘చివరిసారిగా ఆదివారం మధ్యాహ్నం త్రిపుర ఏడుస్తూ ఫోన్‌ చేసింది. ఏం జరిగిందమ్మా అని అడిగేలోపే.. ‘మళ్లీ చేస్తానమ్మా’ అంటూ ఆందోళనగా పెట్టేసింది. ఆ తరువాత మళ్ళీ ఫోన్‌ చేయలేదు. తిరిగి ఎప్పుడెప్పుడు నా బిడ్డ ఫోన్‌ చేస్తుందా? అని ఎదురుచూస్తుండగా.. సోమవారం ఉదయం ఫోన్‌ వచ్చింది. అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని చెప్పారు. నా బిడ్డ చనిపోలేదు.. వాళ్లే చంపేశారు. కట్నం కోసం హింసించిమరీ చంపేశారు. నా బిడ్డను అన్యాయంగా పొట్టన పొట్టుకున్న వాళ్లను కఠినంగా శిక్షించాలి’ అని త్రిపురాంభిక తల్లి పుష్ప ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలా చాలా విషయాలు ఇన్వెస్టిగేషన్ లో బయటికి వస్తుంటే పొట్టి రమేష్ మాత్రం మేము చాలా అన్యోన్యం గా ఉండేవాళ్ళం, మా మద్య ఎలాంటి పొరపొచ్చాలు లేవు అంటూ మీడియాకు చెప్పడం వింతగా ఉంది. రమేష్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.


Comments

Facebook
నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu