నేటి వార్తలు

రికార్డు ధర పలికిన గౌతమి పుత్ర శాతకర్ణి బెనిఫిట్ షో టికెట్ అక్షరాలా లక్షన్నర



నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మక 100 వ చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా తెలుగు జాతి మహారాజు కథతో రూపొందుతున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే 99 సినిమాలు పూర్తి చేసుకుని 100 వ సినిమా పూర్తి చేసిన బాలయ్య తన కెరీర్ లో నిలిచిపోయే గొప్ప చారిత్రాత్మక కథ తో ఈ సినిమా రూపొందటం విశేషం.ఈ సినిమా సంక్రాంతి కానుక గా విడుదల కానున్న సంగతి తెలిసిందే.సంక్రాంతి హీరో గా బాలయ్య కి పేరుంది.ఈ సినిమా మొదలయినప్పటి నుంచి మూవీ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ జరుపుకున్న ఈ సినిమాపై అంచనాలన్నీ తారాస్థాయిలో ఉన్నాయి.కేవలం 78 రోజుల్లో 2 గంటల 15 నిమిషాల్లో కథకు అవసరమయ్యే అన్ని అంశాలతో క్రిష్‌ ఒక గొప్ప సినిమా తీశాడు. ఈ సినిమా పై అటు బాలయ్య అభిమానుల్లోనూ,సినిమాను ప్రేమించి ప్రతి ఒక్క తెలుగువాడి లోను భారీ అంచనాలే ఉన్నాయి.

అభిమానుల్లో అంచనాలు ఎలా వున్నాయో తెలుసుకోవటానికి మనం హైదరాబాద్ బ్రమరాంబ థియేటర్ కి వెళ్ళాల్సిందే.అదేంటి అనుకుంటున్నారా అవునండి హైదరాబాద్ లో బెనిఫిట్ షో లు ఎక్కువగా వేసే థియేటర్ ఇదే.ఈ థియేటర్ లోనే గౌతమి పుత్ర శాతకర్ణి బెనిఫిట్ షో వేస్తున్నారు.ఈ షో లో ఒక్కో టికెట్ 2,000 పలకగా మొట్ట మొదటి టికెట్ 100,100(ఒక లక్షా వంద రూపాయలు) రూపాయలు పలకడం విశేషం.బాలకృష్ణ 100 వ సినిమా కలిసేలా ఇలా 100,100 రూపాయలు వెచ్చించి కొనడం చూస్తేనే ఈ సినిమా క్రేజ్ కి అడ్డం పడుతోంది.ఈ టికెట్ ని నందమూరి బాలకృష్ణ వీరాభిమాని నరసరావుపేట కి చెందిన ఇన్నమూరి గోపిచంద్ సొంతం చేసుకున్నారు.

బాలకృష్ణ  గారు తన అభిమానులను ఉద్దేశించి అనేక సార్లు చెప్పినట్లు గా సమాజానికి బాలకృష్ణ గారితో పాటు ఆయన అభిమానులు కూడా ఉపయోగపడే విషయాన్నీ ఈ షో వేసిన నందమూరి బాలకృష్ణ అభిమానులు మరోసారి నిరూపించుకున్నారు.ఈ 100,100 రూపాయలని హీరో నారా రోహిత్ ద్వారా బాలకృష్ణ గారు మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న ఇండో అమెరికన్ బసవతారకం కాన్సర్ హాస్పిటల్ కి అందించటం విశేషం.అభిమాన హీరో సినిమా బెనిఫిట్ షో లు వేసి సొమ్ము చేసుకుంటున్న ఈ రోజుల్లో బాలయ్య అభిమానులు చేస్తున్న ఈ పనిని చూసి అందరు అభినందనలు తెలుపుతున్నారు.


Comments

Facebook




నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu