అంతర్జాతీయ

అమ్మ ను చంపేశారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు



తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఆదివారం గుండెపోటు రావ‌డంతో ఆమెను హుటాహుటీన చెన్నైలోని అపోలో ఆసుప‌త్రికి త‌ర‌లించారు. జయలలిత ఆరోగ్య పరిస్థితిపై అపోలో ఆస్పత్రి వైద్యులు తాజాగా ఓ ప్రకటన చేశారు. జయలలితకు యాంజియోగ్రామ్‌ విధానం ద్వారా చికిత్సనందిస్తున్నామని వైద్యులు తెలిపారు. 24 గంటలపాటు అబ్జర్వేషన్‌లో ఉంచాలని వైద్యులు ప్రకటించారు. జయలలిత త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు చేయాలని అపోలో వైద్యులు సూచించారు.

 

అమ్మకు ఏమవుతుందో అని అందరూ ఆందోళన చెందుతుంటే..మరి కొందరు మాత్రం ఆమె చనిపోయిందని, నివాళులు కూడా అర్పిస్తూ సోషల్ మీడియాలో తెలుపుతున్నారు. దీనికి తోడు అటు అపోలో ఆస్పత్రి సిబ్బంది కూడా ఇక అంతా దేవుడే చూసుకోవాలి, అమ్మకోసం ప్రార్ధనలు చెయ్యండి అని ట్వీట్ చెయ్యడంతో, జయ చనిపోయిందనే అనుమానాల‌కు మ‌రింత ఊత‌మిస్తున్నాయి.

 

మీడియాలో మాత్రం జయ ఆరోగ్య పరిస్థతి చాలా విష‌మంగా ఉంద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం విషమంగా ఉందంటూ వార్తలు రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అపోలో ఆస్పత్రి వద్ద 1000 మంది పోలీసులు పహారా కాస్తున్నారు.

 

ఆస్పత్రి చుట్టుపక్కల ఉన్న హోటల్స్‌ను, దుకాణాలను ఖాళీ చేయించారు. సీఎం ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో విద్యా సంస్థలు సెలవు ప్రకటించాయి. మ‌రో ప‌క్క అమ్మ అభిమానులు అమ్మ హెల్త్ బులిటెన్ రిలీజ్ చేయాల‌ని గొడ‌వ చేస్తున్నారు.


Comments

Facebook




నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu