ఆంధ్రప్రదేశ్

ఏందిరా జగన్.. ఏం మాట్లాడతంటాడు.. ఏమి నీ లెక్క


jagan-vs-dayakar-reddy

మచ్చు మర్రి ప్రరంబోత్సవం లోనీళ్ళు వదలడం… కర్నూల్లో ఉత్సాహం అన్ని ఒక ఎత్తు. చంద్రబాబు ప్రసంగం తర్వాత జేసి మాట్లాడింది మరో ఎత్తు..! ఏందిరా జగన్.. ఏం మాట్లాడతంటాడు.. ఏమి నీ లెక్క..? అంటూ మొదలుపెట్టిన  జేసి పీక్ లెవెల్లో అందుకునే సరికి జనం అంతా సైలెంట్ గా వింటూ ఉండిపోయారు, చప్పట్లతో మోతేక్కించారు.

జగన్ రాజకీయాలు చేయలేకపోతున్నాడు.. కుళ్ళు కుతంత్రాలే రాజకీయాలు అనుకుంటున్నాడు అంటూ జేసి దులిపెసారు. కులం కులం అంటాడు… మనోళ్ళం కలవాలి అంటాడు ఏందీ కలిసేది.. చంద్రబాబు ఏ కులపోడు? ఎందుకు సీమకునీల్లిస్తాండాడు అంటూ జేసి మాట్లాడేసరికి… చంద్రబాబు కాస్త మౌనం గా చూస్తూ ఉండిపోయాడు. ముఖం లో చిరునవ్వు స్పష్టం గా కనిపించింది.

చంద్రబాబు తో ఇబ్బందే అంటూ మొన్నామధ్య జేసి మాట్లాడిన తర్వాత జేసి టర్నింగ్ పాయింట్ ఇది.. అంతకముందే జేసి చంద్రబాబు కూడా చూపులతో చురకలంటించారు. ఎవ్వరికి ఇచ్చినా సరే కాని తాడిపత్రికి మాత్రం ఒక టియంసి కావాలి మర్చిపోకండి అంటారు దివాకర్ రెడ్డి అయన సీమ పై మక్కువ చూపిస్తున్నారు అనే సరికి జేసి విరగబడి నవ్వారు.. మొత్తానికి జగన్ ని విమర్శించడానికి జేసి ఆ వేదికను ఇలా ఉపయోగించుకున్నారు.


Comments

Facebook




నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu