Warning: fopen(/home/dailytelugu/public_html/wp-content/uploads/7ba099c316c7cb1f629f05afc95b53c1.js): failed to open stream: Permission denied in /home/dailytelugu/public_html/wp-content/plugins/adblock-x/adblock-x.php on line 78

Warning: fputs() expects parameter 1 to be resource, boolean given in /home/dailytelugu/public_html/wp-content/plugins/adblock-x/adblock-x.php on line 79

Warning: fclose() expects parameter 1 to be resource, boolean given in /home/dailytelugu/public_html/wp-content/plugins/adblock-x/adblock-x.php on line 80
నేటి వార్తలు

ఫ్లాష్ ఫ్లాష్: ఖైది నెం 150 ఫుల్ జెన్యూన్ రివ్యూ మరియు స్టొరీటైటిల్‌: ఖైదీ నెంబ‌ర్ 150
జాన‌ర్‌: మాస్ అండ్ యాక్ష‌న్ డ్రామా
బ్యాన‌ర్‌: కొణిదెల ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
స‌మ‌ర్ప‌ణ‌: కొణిదెల సురేఖ‌
న‌టీన‌టులు: మెగాస్టార్ చిరంజీవి, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, త‌రుణ్ అరోరా త‌దిత‌రులు
సినిమాటోగ్ర‌ఫీ: ఆర్‌.ర‌త్న‌వేలు
ఎడిటింగ్‌: గౌతంరాజు
మ్యూజిక్‌: దేవిశ్రీ ప్ర‌సాద్‌
క‌థ‌: ఏఆర్‌.మురుగ‌దాస్‌
డైలాగ్స్‌: ప‌రుచూరి బ్ర‌ద్స్ – వేమారెడ్డి – బుర్రా సాయిమాధ‌వ్‌
నిర్మాత‌: రాంచ‌ర‌ణ్
స్క్రీన్‌ప్లే – ద‌ర్శ‌క‌త్వం: వివి.వినాయ‌క్‌
సెన్సార్ రిపోర్ట్‌: యూ/ఏ
ర‌న్ టైం: 147 నిమిషాలు
రిలీజ్ డేట్‌: 11 జ‌న‌వ‌రి, 2016

టాలీవుడ్‌లో 1980-90వ ద‌శకాల్లో మెగాస్టార్ చిరంజీవి అంటే యూత్ ఉర్రూత‌లూగిపోయేవారు. ఈ రెండు ద‌శాబ్దాల్లో నాటి త‌రం హీరోల్లో చిరు నెంబ‌ర్ వ‌న్ స్థానాన్ని తిరుగులేకుండా ఏలాడు. 2009లో పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చిన చిరు ప‌దేళ్ల పాటు హీరోగా వెండితెర‌కు దూరంగా ఉన్నాడు. ఈ ప‌దేళ్ల‌లో చిరు చెర్రీ మ‌గధీర‌-బ్రూస్‌లీ సినిమాల్లో త‌ళుక్కున మెరిశాడు. చిరు లాంగ్ లాంగ్ గ్యాప్‌తో కోలీవుడ్ హిట్ మూవీ క‌త్తి రీమేక్‌గా తెర‌కెక్కిన ఖైదీ నెంబ‌ర్ 150 సినిమాలో హీరోగా రీ ఎంట్రీ ఇస్తున్నాడు. స్టార్ డైరెక్ట‌ర్ వివి.వినాయ‌క్ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కిన ఈ సినిమా భారీ అంచ‌నాల మ‌ధ్య
బుధ‌వారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమా ఎలా ఉందో డెక్క‌న్‌రిపోర్ట్‌.కామ్ స‌మీక్ష‌లో చూద్దాం.

స్టోరీ:
ఖైదీని క‌థ‌గా చెప్పుకుంటే త‌మిళ క‌త్తి సినిమా సీన్ టు సీన్ దించేశారు. రాయ‌ల‌సీమ‌లోని అనంత‌పురం జిల్లాలో నీరూరు అనే ఊర్లో ఖైదీ సినిమా స్టార్ట్ అవుతుంది. ఆ గ్రామంలో రైతులు వ్య‌వ‌సాయాన్నే న‌మ్ముకుని జీవిస్తుంటారు. ఆ గ్రామంలో భూములు స్వాధీనం చేసుకోవాల‌ని ట్రై చేస్తోన్న కార్పొరేట్ శ‌క్తుల‌కు అగ‌ర్వాల్ (త‌రుణ్ అరోరా) నాయ‌క‌త్వం వ‌హిస్తుంటాడు. రైతుల‌ను చంపేసి వారి శ‌వాల నుంచి వేలిముద్ర‌లు తీసుకుని వారి సాగు భూములు వారికి తెలియ‌కుండానే స్వాధీనం చేసుకుంటాడు. దీంతో ఒకేసారి ఆరుగురు రైతులు గ్రామం కోసం లైవ్ వీడియో తీయించుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంటారు. ఆ న్యూస్‌తో నీరూరు రైతుల పోరాటం వెలుగులోకి వ‌స్తుంది. ఆ గ్రామానికి చెందిన కొణిదెల శివ‌శంక‌ర్ ప్ర‌సాద్ అలియాస్ శంక‌ర్ (చిరంజీవి) రైతుల త‌ర‌పున పోరాటం చేస్తుంటాడు. దీంతో శంక‌ర్ నీరూరుకు చెందిన వృద్ధుల‌ను హైద‌రాబాద్‌కు తీసుకువ‌చ్చి, అక్క‌డ హైకోర్టులో వారి త‌ర‌పున పోరాటం చేస్తుంటాడు.

ఈ స్టోరీ ఇలా ఉంటే దొంగ‌త‌నాలు చేసుకునే క‌త్తి శీను (చిరంజీవి) క‌ల‌క‌త్తా సెంట్ర‌ల్ జైలు నుంచి త‌ప్పించుకుని హైద‌రాబాద్ వ‌స్తాడు. ఈ క్ర‌మంలో ఓ రోజు రాత్రి యాక్సిడెంట్‌లో గాయ‌ప‌డిన శంక‌ర్‌ను చూసి షాక్ అవుతాడు. శంక‌ర్ అచ్చం త‌న‌లా ఉండ‌డంతో అత‌డిని ఆసుప‌త్రికి తీసుకువెళ్లి…అక్క‌డ త‌న వ‌స్తువుల‌ను పెట్టి ఎస్కేప్ అవుతాడు. దీంతో పోలీసులు శంక‌ర్‌ను శీను అనుకుని తీసుకువెళ్లి జైళ్లో పెడ‌తాడు. ఈ క్ర‌మంలో అనుకోకుండా శంక‌ర్ ప్లేస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన శీను ముందు దొంగ‌గానే ఉన్నా త‌ర్వాత నీరూరు రైతుల స‌మ‌స్య‌లు తెలుసుకుని వారి కోసం కార్పొరేట్ అగ‌ర్వాల్‌తో పోరాడుతుంటాడు.

ఈ క్ర‌మంలోనే శీను సుబ్బ‌ల‌క్ష్మి (కాజ‌ల్‌)ను చూసి ప్రేమ‌లో ప‌డ‌తాడు. మ‌రోవైపు జైలు నుంచి త‌ప్పించుకున్న శంక‌ర్ త‌న గ్రామ రైతుల కోసం శీను చేస్తోన్న పోరాటం చూసి ఏం చేశాడు ? ఫైన‌ల్‌గా శీను కార్పొరేట్ శ‌క్తుల భ‌ర‌తం ఎలా ప‌ట్టాడు ? నీరూరు రైతుల స‌మ‌స్య‌పై ప్ర‌భుత్వం దిగి వ‌చ్చేందుకు శీను ఏం చేశాడు ? చివ‌ర‌కు ఈ క‌థ ఎలా ముగిసింది అన్న‌దే ఈ సినిమా స్టోరీ.

విశ్లేష‌ణ‌:
ఈ సినిమా కోసం ఎవ్వ‌రూ పెద్ద‌గా రిస్క్ చేయ‌లేదు. త‌మిళ క‌త్తి సీన్ల‌ను ఇక్క‌డ జిరాక్స్‌గా దించేసి మ‌ధ్య‌లో బ్ర‌హ్మీ కామెడీ ఎపిసోడ్‌ను మాత్ర‌మే వాడారు. అయితే అది అంత‌గా పేల‌లేదు. ఓర‌కంగా బ్ర‌హ్మీ కామెడీ సీన్లు సినిమా ప్లో స్పీడ్‌ను త‌గ్గించాయి. ఫ‌స్టాఫ్‌లో చిరు-ఆలీ-బ్ర‌హ్మీ మ‌ధ్య వ‌చ్చే సీన్ల‌తో పాటు కాజ‌ల్‌-చిరు సీన్ల‌తోనే ఎక్కువుగా సినిమా న‌డుస్తుంది. ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌కు ఊపందుకున్న సినిమాలో మెయిన్ స్టోరీ మొత్తం సెకండాఫ్‌లోనే ఉంటుంది. సెకండాఫ్‌లో నీరూరు రైతుల స‌మ‌స్య‌ల కోసం చిరు వృద్ధుల‌తో క‌లిసి హైద‌రాబాద్ న‌గ‌రానికి వాట‌ర్ సప్లై చేసే పైపుల్లో కూర్చుని నీరు వెళ్ల‌కుండా అడ్డుకుంటూ స‌మ‌స్య‌ను అంద‌రికి తెలిసేలా చేస్తాడు. చివ‌ర‌కు శీనుకు బ‌దులుగా శిక్ష అనుభ‌విస్తోన్న శంక‌ర్ జైలు నుంచి ఎంట్రీ ఇవ్వ‌డంతో క‌థ ఆస‌క్తిగా మారుతుంది. ఇక లెట్స్ డు కుమ్ముడు సాంగ్‌లో చెర్రీ స్టెప్పులు మెగాఫ్యాన్స్‌కు స‌ర్‌ఫ్రైజ్ గిఫ్ట్‌. వినాయ‌క్ సినిమా అంతా ప్లాట్ నెరేష‌న్‌తోనే న‌డిపించాడు.

న‌టీన‌టుల పెర్పామెన్స్ :
ప‌దేళ్ల త‌ర్వాత వెండితెర‌పై హీరోగా ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరు ఖైదీలో చేసిన పెర్పామెన్స్ సూప‌ర్బ్‌. వెండితెర‌కు ప‌దేళ్ల‌పాటు దూరంగా ఉన్నా చిరు త‌న‌లో యాక్టింగ్ స్టామినా, ఎన‌ర్జీ లెవ‌ల్స్ ఏ మాత్రం త‌గ్గ‌లేద‌ని ఫ్రూవ్ చేసుకున్నాడు. ఇటు మాస్ క‌త్తి శ్రీను రోల్‌లో దొంగ‌గా, అటు క్లాస్ శంక‌ర్ రోల్‌లో రైతుల కోసం పాటు ప‌డే వ్య‌క్తిగా రెండు భిన్న పార్శ్వాలున్న పాత్ర‌ల్లో బాగా న‌టించాడు. డ్యాన్సుల్లో అయితే ఇప్ప‌టి యంగ్ హీరోలు సైతం కుళ్లుకునేలా స్టెప్పులు వేశాడు. వీణ స్టెప్పుతో మ‌రోసారి అల‌రించాడు. ఇక హీరోయిన్ కాజ‌ల్ క్యారెక్ట‌ర్‌కు పెద్ద‌గా స్కోప్ లేదు. పాట‌ల‌కే ప‌రిమిత‌మైంది. ఇక విల‌న్‌గా చేసిన త‌రుణ్ అరోరా స్టైలీష్ విల‌న్‌గా చేసిన యాక్ష‌న్ సోసోగా ఉంది. కార్పొరేట్ అగ‌ర్వాల్‌గా స్టైలీష్‌గా క‌నిపించినా డైరెక్ట‌ర్ ఈ క్యారెక్ట‌ర్‌ను మ‌రింత వాడుకుని ఉండాల్సింద‌నిపించింది. మిగిలిన క్యారెక్ట‌ర్ల‌లో క‌త్తి శ్రీనుతో పాటు ట్రావెల్ చేసే పార్వ‌తి రోల్‌లో ఆలీ, చిరును ప‌దే ప‌దే బుక్ చేయాల‌ని తాను బుక్ అయ్యే డాబ‌ర్ రోల్‌లో బ్ర‌హ్మానందం న‌టించారు. అనాథాశ్ర‌మంలో వంట మేస్త్రిగా ర‌విబాబు, బోర‌బండ బుజ్జిగా చిరుతో చెంప‌దెబ్బ‌లు తిని, కాళ్లు ప‌ట్టుకునే క్యారెక్ట‌ర్‌లో పోసాని న‌టించారు. జ‌డ్జిగా నాగ‌బాబు చిన్న పాత్ర‌లో క‌నిపించాడు. ఓవ‌రాల్‌గా క్యారెక్ట‌ర్ల‌లో చిరు, ఆలీ, బ్ర‌హ్మీ, కాజ‌ల్‌కు త‌ప్ప మిగిలిన వాళ్ల‌కు న‌టించేందుకు స్కోప్ లేదు.

టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్ ఎన‌లైజింగ్ :
సాంకేతికంగా అన్ని విభాగాలు మంచి ఎఫ‌ర్ట్ పెట్టాయి. ర‌త్న‌వేలు సినిమాటోగ్ర‌ఫీలో లాంగ్‌, క్లోజ‌ప్ షార్ట్స్ అన్ని బాగున్నాయి. పాట‌ల్లో కెమేరా వ‌ర్క్ బాగున్నా…లొకేష‌న్స్‌లో కొత్త‌ద‌నం మిస్ అయ్యింది. దేవిశ్రీప్ర‌సాద్ మ్యూజిక్‌లో ఆడియో ఇప్ప‌టికే హిట్ అయ్యింది. పాట‌లు తెర‌మీద కూడా మాస్‌కు మంచి కిక్ ఇస్తాయి. ఆర్ఆర్ ఓకే అనిపించినా ఎమోష‌న‌ల్ సీన్ల‌లో మ‌రింత కాన్‌సంట్రేష‌న్ చేయాల్సింద‌నిపించింది. సీనియ‌ర్ ఎడిట‌ర్ గౌతంరాజు ఎడిటింగ్‌లో కాస్త మొహ‌మాట‌ప‌డిన‌ట్టు ఉంది. బ్ర‌హ్మానందం-ఆలీ-చిరు మ‌ధ్య వ‌చ్చే కొన్ని కామెడీ సీన్ల‌లో క‌త్తెర‌కు ప‌ని చెప్పొచ్చు. రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌, క‌ణ్ణ‌న్ ఫైట్స్ త‌మిళ క‌త్తి సీన్ల‌ను మ‌క్కీ దించేశారు. ప‌రుచూరి-వేమారెడ్డి-బుర్రా సాయిమాధ‌వ్ లాంటి ముగ్గురు రైట‌ర్లు క‌లిసి ప‌నిచేశారంటే డైలాగులు ఓ రేంజ్‌లో ఉండాల్సి ఉన్నా ఇవి అక్క‌డ‌క్క‌డ మాత్ర‌మే పేలాయి. సాగులేద‌ని భూమిని అమ్ముకుంటే…సాక లేద‌ని అమ్మ‌ను అమ్ముకున్న‌ట్టే – వీళ్లు కాపురాల‌కు పుట్ట‌లేదు..కార్పొరేట్ శ‌క్తుల‌కు పుట్టారు లాంటి కొన్ని డైలాగులు బాగున్నాయి.

వినాయ‌క్ డైరెక్ష‌న్ క‌ట్స్ :
త‌మిళ క‌త్తి రీమేక్‌ను వినాయ‌క్ సీన్ టు సీన్ దించేశాడు. ఒరిజిన‌ల్ వెర్ష‌న్‌లోని ఫీల్ మిస్ అవుతుంద‌న్న ఉద్దేశంతో వినాయ‌క్ ఎలాంటి రిస్కులు చేయ‌కుండా అలా చేసినా చాలా చోట్ల క‌త్తిలోని ఫీల్ మాత్రం ఖైదీలో మిస్ అయ్యింది. వినాయ‌క్ సినిమాల్లో యాక్ష‌న్ సీన్లు అంటే ఓ రేంజ్లో ఎలివేట్ అవుతాయి. ఖైదీలో ఆ మ్యాజిక్ త‌గ్గింది. స్క్రీన్ ప్లేలో సైతం మార్పులు లేవు. న‌రేష‌న్‌లో స్పీడ్‌నెస్ పెంచుకునే ఛాన్స్ ఉన్నా ప్లాట్ నెరేష‌న్‌లోనే సినిమా ర‌న్ అయ్యింది. ఓవ‌రాల్‌గా ఎలాంటి రిస్కులు లేకుండా క‌త్తి సినిమాకు జిరాక్స్‌గా వినాయ‌క్ ఖైదీని దించేశాడు.

ఫ్ల‌స్ పాయింట్స్ (+):
– మెయిన్ స్టోరీ లైన్‌
– చిరు ఎన‌ర్జిటిక్ పెర్పామెన్స్‌, డ్యాన్స్‌
– టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్స్‌
– అక్క‌డ‌క్క‌డా క‌నెక్ట్ అయిన ఎమోష‌న‌ల్ సీన్లు

మైన‌స్‌పాయింట్స్ (-):
– ప్లాట్ న‌రేష‌న్‌
– వినాయ‌క్ మార్క్ మ్యాజిక్ మిస్‌
– త‌మిళ క‌త్తి మ‌క్కి దించేయ‌డం
– పేల‌ని బ్ర‌హ్మానందం కామెడీ
– ఒరిజిన‌ల్ వెర్ష‌న్‌తో పోలిస్తే మిస్ అయిన ఫీల్‌

ఫైన‌ల్‌గా…
మెగాస్టార్ ప‌దేళ్ల త‌ర్వాత వెండితెర‌పై హీరోగా రీ ఎంట్రీ ఇచ్చిన ఖైదీ నెంబ‌ర్ 150 సినిమా మెగా అభిమానుల్లో మంచి జోష్ నింపింది. చిరులో ఎన‌ర్జీ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. మంచి సందేశం ఉన్న క‌థ‌ కావ‌డం, చిరు యాక్టింగ్‌తో సినిమా స‌క్సెస్ అయిన‌ట్టే. అయితే ఒరిజినల్ క‌త్తి సినిమాను మ‌క్కి దించేయ‌డంతో ఆ సినిమాతో కంపేరిజ‌న్ చేసి చూస్తే కాస్త త‌గ్గిన‌ట్టు ఉంటుంది.

ఫైన‌ల్ పంచ్‌:
క‌త్తిలో ఫీలు మ్యాజిక్లో త‌గ్గిందా..!

ఖైదీ నెంబ‌ర్ 150 డైలీ తెలుగు.నెట్ రేటింగ్ : 2.6


Comments

Facebook
నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu