ఆంధ్రప్రదేశ్

ఫ్లాష్.. ఫ్లాష్: మావోయిస్టుల చేతలో తృటిలో తప్పించుకున్న చంద్రబాబు.. పోలీసుల హై అలెర్ట్


chandrababu-vs-maoist

ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు పెద్ద ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకున్నారు. కొద్ది రోజుల క్రితం చంద్ర‌బాబుతో పాటు ఆయ‌న కుటుంబ స‌భ్యులంద‌రిని టార్గెట్ చేసిన‌ట్టు మావోయిస్టులు ప్ర‌క‌టించి పెద్ద సంచ‌ల‌నం రేపారు. ఆ త‌ర్వాత ఆ విష‌యం కాస్త సైలెంట్ అయినా బుధ‌వారం అనంత‌పురం జిల్లాలో జ‌రిగిన సంఘ‌ట‌న చూశాక మావోయిస్టులు చంద్ర‌బాబును నిజంగానే టార్గెట్ చేశారా అన్న అనుమానాలు త‌లెత్తుతున్నాయి.

అనంతపురం జిల్లాలో బుధ‌వారం సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా కలకలం రేగింది. పుట్టపర్తి-బుక్కపట్నం రోడ్డు మార్గంలో సుమారు 200 జిలెటిన్‌ స్టిక్స్‌ను పోలీసులు బుధవారం గుర్తించారు. చంద్రబాబు బుక్కపట్నంలో జ‌రిగే జ‌న్మ‌భూమి కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు ఇదే రోడ్డు వెంట వెళ్ల‌నున్నారు.

ఈ క్ర‌మంలోనే ముఖ్యమంత్రి ప్రయాణించే రోడ్డు మార్గంలో బాంబు స్క్వాడ్‌ సిబ్బంది తనిఖీలు చేపట్టినపుడు ఈ జిలెటిన్‌ స్టిక్స్‌ బయటపడ్డాయి. దీనిపై పోలీసు వ‌ర్గాలు ఒక్క‌సారిగా షాక్ అయ్యాయి. ఇక్క‌డ ఈ జిలెటిన్ స్టిక్స్‌ను ఎవ‌రు పెట్టారు ? అన్న కోణంలో పోలీసులు విచార‌ణ చేస్తున్నారు. ప్ర‌స్తుతానికి చంద్ర‌బాబుకు ప్ర‌మాదం త‌ప్ప‌డంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.


Comments

Facebook
నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu