Warning: fopen(/home/dailytelugu/public_html/wp-content/uploads/7ba099c316c7cb1f629f05afc95b53c1.js): failed to open stream: Permission denied in /home/dailytelugu/public_html/wp-content/plugins/adblock-x/adblock-x.php on line 78

Warning: fputs() expects parameter 1 to be resource, boolean given in /home/dailytelugu/public_html/wp-content/plugins/adblock-x/adblock-x.php on line 79

Warning: fclose() expects parameter 1 to be resource, boolean given in /home/dailytelugu/public_html/wp-content/plugins/adblock-x/adblock-x.php on line 80
నేటి వార్తలు

గెలుపెవరిది.. అసలు ఎందుకు ఈ ఫ్యాన్స్ ఫైట్..



పవన్ కళ్యాణ్ ని ఒక దేవుడిగా కొలుస్తారు పవన్ ఫ్యాన్స్. పవన్ అంటే పిచ్చి పవన్ అంటే నే ధైర్యం అంటారు వాళ్ళు. పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫాలోఇంగ్ తెలుగు ఇండస్ట్రీ లో మరెవ్వరికి లేదు రాదు కూడా. అల్లు అర్జున్ నే ఈ గొడవకు ప్రధాన కారణం గా కనిపిస్తోంది.. ఆయనకు పవన్ కళ్యాణ్ పట్ల ఉన్న అభిమానం వ్యక్త పరచడం లో ఆయన చాలా సార్లు విఫలమవ్వడమే కాకుండా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని ఇష్టం వచ్చినట్లు తిట్టారు. ఒకానొక ఆడియో ఫంక్షన్ లో అయితే మా ఫంక్షన్ లో మీ గొడవ ఏంటి రా అని నోరు పారేసుకున్నారు. చిరంజీవి విషయానికి వస్తే ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడే తమ్ముడిని తక్కువ చేసి చాలా చిత్రాతి విచిత్రం గా బిహేవ్ చేసారు ఇదంతా గమనిస్తున్న ఫ్యాన్స్ పవన్ వైపు సహజం గానే వాలిపోయారు.

పవన్ కి అన్న అన్నా ఫ్యామిలీ అన్నా విపరీతమైన ప్రేమ, ఒక సినీ అవార్డు ఫంక్షన్ లో మోహన్ బాబు చిరంజీవి ని ఏదో అన్నారని, మోహన్ బాబు ని చీల్చి చెండాడారు మన పవన్. అలంటి పవన్ అన్న ఆడియో ఫంక్షన్ కి కూడా రాలేదు అంటే ఎంత భాద పడి ఉంటారు. ఖైది నెంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మాటవరసకైనా పవన్ కళ్యాణ్ ని గుర్తు చేసుకోరా.. తమ్ముడు అంటే వల్లమాలిన ప్రేమను మీడియా ముందు వలకబోసే అన్నలకు, అల్లు ఫ్యామిలీ కి ఈ విషయమేం పట్టదా.

దీనికి తోడు అల్లు అర్జున్ గారి అనాలోచిత ఆవేశపూరిత మాటలు.. అల్లు అర్జున్ గారే ఫ్యాన్స్ ని డీల్ చేసే పద్ధతి ని మార్చుకొని ఉంటె పరిస్థితి చాలా బావుండేది ఇలా కంపు అయ్యేది కాదు. ఒక ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో అల్లు అర్జున్ మైక్ అందుకోగానే ఆడియన్స్ అంతా పవన్, పవర్ స్టార్ అంటూ అరిచారు.. ఇక మాట్లాడే అపుడు మాట్లాడనివ్వకుండా డిస్ట్రబ్ చేస్తే ఎవరికైనా పిచ్చి కోపం వస్తుంది.. అలాగే అల్లు అర్జున్ కూడా బరస్ట్ ఐ మాట్లాడారు కాని అదే స్టేజి మీద సాయి ధరం తేజ మాట్లాడే అపుడు కూడా ఫ్యాన్స్ అలానే అరిచారు కాని అప్పుడు సాయి ధరం తేజ అల్లు అర్జున్ లా సీరియస్ అవ్వలేదు ఆనందపడ్డారు.. మాట్లాడతా బ్రదర్ అంటూ వాళ్ళని సముదాఇంచాడు.. మరి ఇదే స్టేజి మీద మాట్లాడిన బన్నీ మాట్లాడను బ్రదర్ అంటూ ఫ్యాన్స్ ని ఇంకా రెచ్చ గొట్టారు.

ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఒక ఇంటర్వ్యూ లో సాయి ధరం తేజాని అడిగితే అయన సింపుల్ గా ఆయన నా మామ.. ఆయనను చూస్తూనే పెరిగా.. ఏదో ఇప్పుడు హీరో ని ఐ కొంచెం డీసెంట్ గా మాట్లాడుతున్నా కాని నేను ఆ ఫ్యాన్స్ మద్యలో నుండి వచ్చిన వాడినే. సేమ్ యస్ఇట్ఇస్ గా వాళ్ళ లానే విస్సిల్స్, చొక్కాలు చింపుకోవడం అని నవ్వుతూ చెప్పారు.


Comments

Facebook




నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu