గాసిప్స్

ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ప‌రీక్ష‌ల్లో స‌న్నీలియోన్‌పై ప్ర‌శ్న‌లు


sunny-leone-questions-on-public-service-comission

భార‌త‌దేశంలోని ఓ రాష్ట్రంలో ప‌రీక్ష పేప‌ర్లో ఫోర్న్‌స్టార్ స‌న్నీలియోన్‌పై ప్ర‌శ్న రావ‌డం సంచ‌ల‌నం క‌లిగించింది. ఓ ఫోర్న్‌స్టార్ పేరు ప‌రీక్ష పేప‌ర్లో రావ‌డం నిజంగా అంద‌రికి పెద్ద షాక్ ఇచ్చింది. స‌హ‌జంగా అటువంటి ప‌రీక్ష‌ల్లో భార‌త‌దేశానికి ప్రాతినిధ్యం వ‌హించిన క్రికెట‌ర్లు, హాకీ ప్లేయ‌ర్ల పేర్లు రావ‌డమే చాలా అరుదుగా ఉంటాయి. అటువంటి స‌న్నీలియోన్ పేరు రావ‌డం ఆశ్చ‌ర్య‌మే మ‌రి. ఇండియాలోని ఓ రాష్ట్రంలో పరీక్ష పేపర్లోకి స‌న్నీ ఎక్కేసింది. అది మామూలు పరీక్ష కూడా కాదు. కేరళ పబ్లికి్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ లో సన్నీ పేరు కనిపించింది.

ఈ ప‌రీక్ష‌లో ‘ఆల్ఫాబేట్ సూపర్ ఫర్ లవర్స్’ అనే పుస్తకం రచయిత ఎవరు అని ప్ర‌శ్న ఇచ్చి.. జ‌వాబులోని నాలుగు ఆప్షన్లలో సన్నీ లియోన్ పేరే ముందు ఉండటం విశేషం. దీనికి సరైన జవాబు మాత్రం ‘అనంద స్వరూప్ గుప్తా’ అనే ఆప్షన్ చివర్లో ఇచ్చారు. ఆ మధ్య మహారాష్ట్రలోని ఒక స్కూల్లో విద్యార్థుల‌కు నిర్వ‌హించిన‌ పరీక్ష పేపర్లో ఇచ్చిన‌ ప్రశ్నపెద్ద దుమార‌మే రేగింది. ఈ కింది వారిలో విరాట్ కోహ్లి ప్రేయసి ఎవరు.. అంటూ క్వశ్చన్. దీపికా పదుకొనే.. అనుష్క శర్మ.. అంటూ ఆప్షన్స్.. మహారాష్ట్రలో దీనిపై పెద్ద దుమారమే రేగింది. పిల్లల జనరల్ నాలెడ్జ్ ప‌రీక్ష‌కు ఇలాంటి ప్రశ్నలేస్తారా అంటూ ఆ స్కూల్ యాజమాన్యాన్నితల్లిదండ్రులు దుమ్ము దులిపేశారు . సోషల్ మీడియాలో ఈ విషయం అప్ప‌ట్లో హాట్ టాపిక్ అయింది.

ఇప్పుడు పోర్న్ స్టార్ సన్నీ లియోన్ పేరు ఒక రాష్ట్రం నిర్వహించే పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఇలా సన్నీ లియోన్ పేరుతో కామెడీ చేయడం త‌గ‌దంటూ కొందరు విమర్శిస్తుంటే.. అక్కడ ఇచ్చిన ప్ర‌శ్న‌ చూస్తే సన్నీ పేరివ్వడంలో తప్పేముందంటూ మ‌రికొందరు కొట్టిపారేస్తున్నారు. ఏది ఏమైనా మొత్తానికి ఇండియాలో సన్నీ పాపులారిటీకి ఈ ప్రశ్నే నిదర్శనం అంటున్నారు జనాలు. సోషల్ మీడియాలో ఈ ప్రశ్నగురించి పెద్ద చర్చ నడుస్తోంది. సన్నీ లియోన్ కూడా ఈ సంగతి గుర్తించి ట్విట్టర్లో స్పందించింది. ఈ పరిణామం పట్ల ఆమె ఆశ్చర్యపోయింది. నిజంగా త‌మ పేరు అంత‌టి పెద్ద ప‌రీక్ష‌లో వ‌స్తే ఎవ‌రికైనా ఆశ్చ‌ర్యంగానే ఉంటుంది క‌దా.. అదే ఆమె వ్య‌క్త‌ప‌రిచింది.


Comments

Facebook
నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu