ఆంధ్రప్రదేశ్

పవన్ పై 2 గంటల్లోనే కౌంటర్ ఎటాక్ చేసిన TDP



జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితుల స‌మ‌స్య‌ల‌పై చేసిన స‌వాల్‌పై టీడీపీ మంత్రులు స్పందించారు. ఈ రోజు ఉద్దానం బాధితుల‌ను ప‌రామ‌ర్శించేందుకు ఉద్దానంలో ప‌ర్య‌టించిన ప‌వ‌న్ ఉద్దాన ప్రాంతంలో ఎంతోమంది ప్ర‌జ‌లు కిడ్నీ స‌మ‌స్య‌ల‌తో ఏళ్ల‌కు ఏళ్లుగా బాధ‌ప‌డుతుంటే ఈ ప్ర‌భుత్వం ఏం చేస్తోంద‌ని ఫైర్ అయ్యారు.

దీనిపై ప్ర‌భుత్వం, ఆరోగ్య శాఖా మంత్రి త‌క్ష‌ణ‌మే స్పందించి 48 గంటల్లోగా ఏం చేస్తారో చెప్ప‌క‌పోతే తాను ఈ ఉద్యమాన్ని ప్ర‌జా ఉద్య‌మంగా మార్చి ….దానిని తానే లీడ్ చేస్తాన‌ని ప్ర‌భుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. అలాగే ఈ స‌మ‌స్య ప‌రిష్కారానికి ఓ క‌మిటీ వేసిన ప‌వ‌న్ ఆ నివేదిక‌ను 15 రోజుల్లో ప్ర‌భుత్వానికి తానే స్వ‌యంగా ఇస్తాన‌ని కూడా చెప్పారు. ఇక ప‌వ‌న్ 48 గంట‌ల్లో బాధితుల‌కు ప్ర‌భుత్వం ఏం చేస్తుందో చెప్పాల‌ని డెడ్‌లైన్ పెట్ట‌డంతో టీడీపీ మంత్రులు, ఓ ఎంపీ అలెర్ట్ అయ్యారు. వెంట‌నే ప‌వ‌న్ స‌వాల్‌పై స్పందించారు. ప‌వ‌న్ సూచ‌న‌లు తీసుకుంటామ‌ని చెపుతూనే లైట్‌గా ప‌వ‌న్‌కు చుర‌క‌లు వేశారు.

మంత్రులు ప్ర‌త్తిపాటి పుల్లారావు – అచ్చెన్నాయుడు – కామినేని శ్రీనివాస్ ప‌వ‌న్ స‌వాల్‌పై మాట్లాడారు. ప్రభుత్వం దృష్టికి పవన్ తీసుకువచ్చిన సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తామని చెప్పారు. అయితే శ్రీకాకుళంలో కిడ్నీ సమస్యలు తీవ్రంగా ఉన్నట్లు ప్రభుత్వం దృష్టికి రాలేదని పుల్లారావు వివరించారు. కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యం వల్లే శ్రీకాకుళం ప్రజలు కష్టాలు పడుతున్నారని పుల్లారావు ఆరోపించారు.

ఇక ఎంపీ రామ్మోహ‌న్‌నాయుడు స్పందిస్తూ ఏ ప్రజాప్రతినిధి కూడా జాతీయ స్థాయికి ఈ అంశాన్ని తీసుకు వెళ్ల‌లేద‌న్న అంశంపై కౌంట‌ర్ ఇచ్చారు. ఉద్దానం కిడ్నీ స‌మ‌స్య‌ల‌పై తాను పార్ల‌మెంటులో చ‌ర్చించాన‌ని చెప్పారు. కిడ్నీ సమస్యల పరిష్కారానికి నిధుల కొరత గురించి పవన్ పేర్కొనడం సరికాదన్నారు. ఇక ఇక్క‌డ స‌మ‌స్య మూలానికి అంత‌ర్జాతీయ ప‌రిశోధ‌న‌లు చేసినా ఎలాంటి ప‌రిష్కారం దొర‌క‌లేద‌ని మ‌రో మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. ఏదేమైనా ప‌వ‌న్ టీడీపీ స‌ర్కార్‌కు 48 గంట‌లు టైం ఇస్తే టీడీపీ మంత్రులు, ఎంపీ నుంచి కేవ‌లం 2 గంట‌ల్లోనే కౌంట‌ర్ ఎటాక్ వ‌చ్చేసింది. మ‌రి దీనిపై ప‌వ‌న్ సంతృప్తి చెందుతాడా ? లేదా మ‌ళ్లీ స్పందిస్తాడా అన్న‌ది చూడాలి.

 


Comments

Facebook




నేటి వార్తలు

Copyright © 2016 DailyTelugu.in

To Top
Download Premium Magento Themes Free | download premium wordpress themes free | giay nam dep | giay luoi nam | giay nam cong so | giay cao got nu | giay the thao nu